ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి - Dupper

Breaking

Top Add

Post Top Ad

7, నవంబర్ 2021, ఆదివారం

ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి

 



దేశానికి ప్రధాని అంటే అత్యంత భద్రత ఉంటుంది. ఇక ఆయన నివాసం చుట్టూ వందల సంఖ్యలో సైనికులు పహారా కాస్తుంటారు. అంతటి పటిష్ట భద్రతను దాటుకుని ప్రధానిపై హత్యాయత్నం జరిగింది.


ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్న దుండగులు డ్రోన్ సాయంతో ప్రధాని నివాసంపై దాడి చేశాడు. ఆ డోన్ నిండా పేలుడు పదార్థాలను పెట్టి.. ప్రధాని నివాసంపై దాడికి పాల్పడ్డారు. కాగా.. ఈ దాడి నుంచి ప్రధాని సురక్షితంగా బయటపడగా.. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని బాగ్దాద్‌లో చోటు చేసుకుంది.


అక్కడి మీడియా వెల్లడించిన వివరాల మేరకు.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ప్రధాని అల్ కదిమి ముస్తఫా నివాసంపై ఈరోజు(ఆదివారం) తెల్లవారు జామున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ తో దాడి జరిగింది. కాగా.. ఈ దాడి నుంచి ప్రధాని సురక్షితంగా బయట పడినట్లు ఇరాక్ ఆర్మీ ప్రకటించింది. అయితే.. ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని లక్ష్యంగా డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Top Ad