1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో నాని నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. - Dupper

Breaking

Top Add

Post Top Ad

7, నవంబర్ 2021, ఆదివారం

1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో నాని నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'.

 


నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ బాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు నటిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.


తాజాగా 'రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌'ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. 'శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే'' అంటూ ఈ పాట సాగుతోంది. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీయర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Top Ad