యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి - Dupper

Breaking

Top Add

Post Top Ad

7, నవంబర్ 2021, ఆదివారం

యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి

 



యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడారు.


వానా కాలం వరి పంటను మాత్రమే రాష్ట్ర సర్కార్‌ కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికి లేదన్నారు. యాసంగిలో తేమ కారణంగా వరి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, వ్యవసాయ పంటల ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు.


రాబోయే కాలంలో బాయిల్డ్‌ బియ్యాన్ని కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే సీడ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి పంట వేసుకొవచ్చని తెలిపారు. యాసంగిలో వరి పంట వేయొద్దని చెప్పారు. వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. వర్షా కాలంలో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Top Ad